మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్‌ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..! | Kannada Hero Yash Mother Pushpa Arun Kumar Shocking comments On His Son | Sakshi
Sakshi News home page

Yash Mother: యశ్‌తో ఎలాంటి సినిమా తీస్తారు?.. కేజీఎఫ్‌ హీరో తల్లి ఆసక్తికర సమాధానం..!

May 21 2025 5:28 PM | Updated on May 21 2025 6:50 PM

Kannada Hero Yash Mother Pushpa Arun Kumar Shocking comments On His Son

కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్‌. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్‌ హిట్‌ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్‌ మూవీలో నటిస్తున్నారు.

అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్‌ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.  మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్‌ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్‌. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement