కేజీఎఫ్ హీరో యశ్ మదర్ పుష్పలత పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది నిర్మాతగా ఆమె నిర్మించిన కోతలవాడి మూవీ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూవీ ప్రమోషన్స్ విషయంలో తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు చిత్ర ప్రమోటర్ హరీష్ అరసుపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తనకు రూ.65 లక్షలు మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బెదిరించాడని పుష్పలత పోలీసులకు తెలిపారు.
కాగా.. పాన్-ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్పలత.. పిఏ ప్రొడక్షన్స్ అనే తన సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పేరు పుష్ప, ఆమె భర్త అరుణ్ కుమార్ మొదటి అక్షరాలు వచ్చేలా పెట్టారు. ఈ బ్యానర్‌లో తన మొదటి ప్రాజెక్ట్ కోతలవాడి పేరుతో సినిమా తెరకెక్కిచారు. ఈ చిత్రానికి శ్రీ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు పృథ్వీ అంబార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.


