
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), హీరోయిన్ దీపికా దాస్ వరుసకు కజిన్స్ అవుతారు. కానీ, ఎక్కడా తమ చుట్టరికాన్ని బయటకు చెప్పకుండా ఎవరి కెరీర్ వారే నిర్మించుకున్నారు. అయితే యశ్ తల్లి పుష్ప ఇటీవల నిర్మాతగా మారి కొత్తలవాడి సినిమా తీసింది. ఆగస్టు 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పుష్ప.. దీపికా దాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆమె గురించి ఎందుకు?
నెక్స్ట్ సినిమాలో దీపికా దాస్‌ను ఎంపిక చేసుకునే ఆలోచనలున్నాయా? అన్న యాంకర్ ప్రశ్నపై పుష్ప అసహనం వ్యక్తం చేసింది. అస్తమానూ ఆమె గురించే ఎందుకు అడుగుతారు? రమ్య రక్షిత.. ఇలా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీపిక పెద్ద స్టార్ హీరోయినా? ఆమె ఏం సాధించిందని తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది.
గౌరవం ఇవ్వడం నేర్చుకోండి
రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా దాస్ స్పందించింది. కొత్తగా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులకు పరిచయం చేయాలనుకునేవారు, ముందుగా ఆ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు సంపాదించుకునేందుకు ఎవరి పేరు కూడా వాడుకోలేదు. అవతల ఉన్నది అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే.. నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.
అందుకే మౌనంగా ఉన్నా
ఏదో వారిపట్ల గౌరవంతో ఇంతవరకు సైలెంట్‌గా ఉన్నాను తప్ప భయంతో కాదు! నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నాగురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని ఘాటుగా రియాక్ట్ అయింది. నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా దాస్ కన్నడ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.
చదవండి: ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్