
పిల్లలంటే ఇష్టం.. కానీ ప్రెగ్నెన్సీ అంటే అస్సలు ఇష్టం లేదంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone). ఈ మాట ఊరికే అనలేదు. ఎన్నోసార్లు ఐవీఎఫ్‌కు వెళ్లి ఫెయిల్ అవడం, అనారోగ్యం బారిన పడటంతో ఆమెకు గర్భం దాల్చాలంటేనే విసుగొచ్చింది. అందుకే దత్తత ద్వారా ఓ అనాథకు తల్లిగా మారింది. అలాగే సరోగసి ద్వారా మరో ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది.
ఆరోజే దత్తత తీసుకోవాలని..
తాజాగా సన్నీలియోన్.. నటి సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌కు హాజరైంది. ఈమేరకు ఓ ట్రైలర్ విడుదల చేశారు. అందులో సన్నీలియోన్ మాట్లాడుతూ.. పిల్లల్ని దత్తత తీసుకోవాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఐవీఎఫ్ ఫెయిలైనరోజు దత్తత కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడే ఓ పాపను ఎంచుకున్నాం. సరోగసికి ఎందుకు వెళ్లానంటే.. గర్భం దాల్చి పిల్లల్ని కడుపున మోయడం నాకిష్టం లేదు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాను.
చాలా డబ్బు ఖర్చు చేశాం
సరోగసి కోసం ఎంచుకున్న మహిళకు వారానికి ఒకసారి డబ్బు చెల్లించేవాళ్లం. ఆమె భర్తకు కూడా మనీ ఇచ్చాం. చాలా ఖర్చు చేశాం. ఆ డబ్బుతో ఆమె పెద్ద ఇల్లు కొనుక్కుంది. మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది అని తెలిపింది. కాగా సన్నీలియోన్ నటుడు డేనియల్ వెబర్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. 2017లో వీరు రెండేళ్ల పాపా నిషాను దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి ద్వారా నోవా, ఆషర్ జన్మించారు.