
ప్రేమిస్తున్నానని ఎవరైనా వెంటపడినప్పుడు కొందరు తమకు ఆల్‌రెడీ పెళ్లయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. అలా తను కూడా ఈ అబద్ధం చెప్పానంటోంది దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తే పెళ్లి అనే ఒక్కమాటతో గండం గట్టెక్కానంటోంది.

జాన్వీకపూర్, ఓరీ
పెళ్లయిందని చెప్పా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిందని చాలాసార్లు అబద్ధమాడాను. అయితే ఇండియాలో కాదు.. అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు కొందరు వెయిటర్లు వారి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. నేను ఏదీ ఆర్డర్ చేయకముందే వారు ఏదైనా వంటకాలు తెచ్చి నా ముందుంచేవారు. అలా ఒకసారి ఓరీతో ఉన్నప్పుడు.. అతడినే నా భర్తగా పరిచయం చేసి తప్పించుకున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
సినిమా
జాన్వీకి ఇంకా పెళ్లవలేదు కానీ, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మోడల్ ఓరీ.. జాన్వీకి మంచి స్నేహితుడు. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన పరమ సుందరి నేడు (ఆగస్టు 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం సన్నీ సంస్కారికీ తులసి కుమారి మూవీ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సాన్య మల్హోత్రా, రోహిత్ సరఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.