
భార్య, నటి శ్రీవిద్య సంపాదనతోనే బతుకుతున్నానంటున్నాడు తమిళ దర్శకుడు రాహుల్ రామచంద్రన్ (Rahul Ramachandran). 8 ఏళ్లుగా తన ఖర్చులన్నీ శ్రీవిద్యే చూసుకుందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా భార్య చిన్ను (శ్రీవిద్య) ఎనిమిదేళ్లుగా నన్ను బంగారంలా చూసుకుంటోంది. ఎటువంటి లోటుపాట్లు రానివ్వలేదు. అంతకుముందు మా అమ్మ నన్ను చూసుకునేది. ఆరేళ్లుగా ఏ సినిమా చేయని డైరెక్టర్‌కు సంపాదన ఎక్కడినుంచి వస్తుంది?
అమ్మ ఇచ్చే డబ్బుతో గిఫ్ట్
ఇలాంటి సమయంలో చిన్ను నాకోసం నిలబడింది. ఇప్పుడు నావంతు వచ్చింది. చిన్న బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల కొంత డబ్బు సంపాదించగలిగాను. దానితోనే ఈ మధ్య తనకు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇలా బహుమతిచ్చి చాలాకాలమే అవుతోంది. తన పుట్టినరోజు వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర కొంత డబ్బు తీసుకుని ఏదో ఒక గిఫ్ట్ కొనిస్తుంటాను.
భార్య సంపాదనతో బతుకుతున్నా..
తర్వాతి పుట్టినరోజువరకల్లానైనా నా సొంత డబ్బుతోనే తనకు బహుమతి కొనివ్వాలని కోరుకుంటున్నాను. భార్య సంపాదనతో సంతోషంగా బతుకుతున్నానని చెప్పడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఏదో ఒకరోజు నేనూ నిలబడి తనకు అండగా నిలబడతాను. అదే నమ్మకంతో ఉన్నాను. ఎప్పుడైనా తినడానికి బయటకు వెళ్లినప్పుడు కూడా తన ఫోన్ నాకిచ్చేసి పేమెంట్ చేయమంటుంది అని చెప్పుకొచ్చాడు.
శ్రీవిద్య క్యాంపస్ డైరీ, ఒరు కట్టనందన్ బ్లాగ్, నైట్ డ్రైవ్.. సహా పలు చిత్రాల్లో నటించింది. సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. రాహుల్.. జీబూంబా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత మరే సినిమా చేయలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన రాహుల్- శ్రీవిద్య.. 2024 సెప్టెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నప్పటినుంచే రాహుల్ ఆలనాపాలనా చూస్తున్న శ్రీవిద్య నిజంగా గ్రేట్ అని అభిమానులు కొనియాడుతున్నారు.
చదవండి: శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు