
రజనీకాంత్ (Rajinikanth) నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో శివాజీ (Sivaji Movie) ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్‌గా నటించమని మొదట సత్యరాజ్‌ను సంప్రదించారట! రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట! నేనెంత కష్టపడ్డా సరే.. రజనీకాంత్ వచ్చి స్టైల్‌గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట! శివాజీలో విలన్‌గా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలన్‌గా నటిస్తాడా? అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది.
విలన్‌గా ముద్ర వేస్తారని..
రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్ (Sathyaraj). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు నేను హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్ సృష్టించుకునే పనిలో పడ్డాను. సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా ఆఫర్ చేశాడు. ఒక్కసారి విలన్‌గా చేస్తే ఇక అన్నీ ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు.
39 ఏళ్లు పట్టింది!
కాగా సత్యరాజ్.. విలన్ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్ మొదలుపెట్టాడు. నూరవత్తు నాల్ (1984) చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత మెయిన్ విలన్‌గా మారాడు. ఓపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు. రజనీకాంత్‌తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. వీరిద్దరూ చివరగా నటించింది 1986లో వచ్చిన మిస్టర్ భరత్ మూవీలో! ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది. శివాజీ, ఎంతిరన్ (రోబో) సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్‌గా యాక్ట్ చేశాడు.
చదవండి: ఆ టాలీవుడ్ హీరో అంటే ఫుల్ క్రష్.. సురేఖవాణి కూతురు సుప్రీత