
కవల కూతుళ్లలో ఒకరు మృతి
ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశారు.
దీంతో అభిమానులు, స్త్రీవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు.