బీఎస్‌ఎఫ్‌ తొలి మహిళాఫ్లైట్‌ ఇంజనీర్‌గా భావనా చౌదరి | Inspector Bhawna Chaudhary becomes 1st woman flight engineer in BSF air wing | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌ తొలి మహిళాఫ్లైట్‌ ఇంజనీర్‌గా భావనా చౌదరి

Oct 13 2025 6:01 AM | Updated on Oct 13 2025 6:01 AM

Inspector Bhawna Chaudhary becomes 1st woman flight engineer in BSF air wing

భావనా చౌదరి సహా అయిదుగురికి ఫ్లయింగ్‌ బ్యాడ్జ్‌లు 

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం వైమానిక విభాగం 50 ఏళ్లకు పైగా చరిత్రలో.. తొలి మహిళా ఫ్లైట్‌ ఇంజనీర్‌ను నియమించింది. ఈమె సంస్థలోనే తొలి అంతర్గత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఘనత సాధించడం విశేషం. ఇన్‌స్పెక్టర్‌ భావనా చౌదరి సహా అయిదుగురు పురుష సబార్డినేట్‌ అధికారులకు.. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌధరి ఇటీవల ఫ్లయింగ్‌ బ్యాడ్జ్‌లను అందజేశారు. సరిహద్దు దళం 1969 నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏవియేషన్‌ యూనిట్‌ను నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇది అన్ని పారా మిలిటరీ దళాలు, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వంటి ప్రత్యేక దళాల కార్యాచరణ అవసరాలను తీరుస్తుంది. బీఎస్‌ఎఫ్‌ వైమానిక విభాగంలోని శిక్షకులు ఐదుగురు సబార్డినేట్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇటీవలే రెండు నెలల సుదీర్ఘ శిక్షణను పూర్తి చేశారు. 

130 గంటల తర్ఫీదు 
ఆగస్టులో ప్రారంభమైన ఈ రెండు నెలల అంతర్గత శిక్షణలో ఐదుగురు సిబ్బందికి 130 గంటల పాటు నైపుణ్యం అందించారు. శిక్షణ సమయంలో, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో ఇటీవల సంభవించిన వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా.. వీరు బీఎస్‌ఎఫ్‌ వైమానిక విభాగంలోని వివిధ విమానాలపై అనుభవం పొందారు.  
ఫ్లైట్‌ ఇంజనీర్లకు తీవ్ర కొరత 
‘బీఎస్‌ఎఫ్‌ వైమానిక విభాగం దాని ఎంఐ–17 హెలికాప్టర్ల ఫ్లీట్‌లో ఫ్లైట్‌ ఇంజనీర్ల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. భారత వైమానిక దళం మొదటి బ్యాచ్‌లోని ముగ్గురు సబార్డినేట్‌ అధికారులకు శిక్షణ ఇచి్చంది, అయితే వివిధ పరిమితుల కారణంగా ఐదుగురు సిబ్బందితో కూడిన రెండో బ్యాచ్‌ అక్కడ శిక్షణ స్లాట్‌ను పొందలేకపోయింది’.. అని ఒక అధికారి తెలిపారు. దీంతో బీఎస్‌ఎఫ్, తన వైమానిక విభాగంలో ఫ్లైట్‌ ఇంజనీర్ల కోసం అంతర్గత శిక్షణ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎంహెచ్‌ఏను అభ్యరి్థంచింది. ఇన్‌స్పెక్టర్‌ చౌదరితో సహా ఐదుగురు సిబ్బంది ఇటీవల తమ శిక్షణను పూర్తి చేశారని ఆ అధికారి తెలిపారు. 

ఇన్‌స్పెక్టర్‌ చౌదరి, బీఎస్‌ఎఫ్‌ వైమానిక విభాగంలో మొదటి మహిళా ఫ్లైట్‌ ఇంజనీర్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఈ యూనిట్‌ ఎంఐ17 1వి, ఎంఐ 17 వి5, చీతా, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ వంటి హెలికాప్టర్‌లతో పాటు, వీఐపీ విధుల కోసం ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎంబ్రేయర్‌ జెట్‌ను కూడా నిర్వహిస్తుంది. సుమారు 3 లక్షల మంది సిబ్బంది ఉన్న బీఎస్‌ఎఫ్‌ 1965 డిసెంబర్‌లో ఏర్పాటైంది. అంతర్గత భద్రతలో వివిధ విధులను నిర్వర్తించడంతో పాటు, ఇది ప్రధానంగా భారత్‌–పాకిస్తాన్, భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దుల పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement