9 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | Air Force Agniveer Open Recruitment Rally from 9th | Sakshi
Sakshi News home page

9 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Feb 25 2026 4:14 AM | Updated on Feb 25 2026 4:14 AM

Air Force Agniveer Open Recruitment Rally from 9th

గుంటూరు వెస్ట్‌: ఏపీ, తెలంగాణ మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభమవుతుందని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలి­పారు. మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ­య­న మాట్లాడారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. 

హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూటింగ్‌ డైరెక్టర్‌ వింగ్‌ కమాండర్‌ షేక్‌ యాకూబ్‌ అలీ మాట్లాడుతూ.. మార్చి 9, 10 తేదీలలో ఏపీ, తెలంగాణ యువతులకు, 12, 13 తేదీలలో ఏపీ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీలలో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్‌ ర్యాలీ జరుగుతుందన్నారు. 

గుంటూరులోని నాగార్జున వర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్మీడియట్‌ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement