సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..! | Sakshi
Sakshi News home page

Salaar Movie: సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

Published Tue, Jan 24 2023 7:00 PM

KGF Star Yash Will Acts In Prabhas Movie Salaar Goes Viral - Sakshi

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్‌ కీ రోల్‌ ప్లే చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ నీల్.. యశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement