
రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ 'ఆదిపురుష్' ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు 'రామాయణ్' పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. 'కేజీఎఫ్' యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.
(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ ))
ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.
నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)