సినిమా కోసం నిజమైన బంగారం.. కారణం ఇదే | Ramayan Makers Use Real Gold Outfits For Actor Yash, Who Portraying The Villainous Ravana | Sakshi
Sakshi News home page

సినిమా కోసం నిజమైన బంగారం.. కారణం ఇదే

Published Tue, May 21 2024 8:45 AM

Ramayan Makers Use Real Gold For Ravana

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు.  నితేష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్‌ ధరించే ఆభరణాల నుంచి దుస్తులు, ఆయన ఉపయోగించే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. 

దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి. ఆ నగరం మొత్తం బంగారంతో నిర్మితమై ఉందని ఇతిహాసాల్లో చెప్పారు. దీంతో సినిమాలో కూడా ఆ గొప్పతనాన్ని అలాగే చూపించాలని చిత్ర యూనిట్‌ భావించిందట. దంగల్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రాన్ని నమిత్ మల్హోత్రా , యశ్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement