మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే! | Kareena Kapoor says she is open Acts with step-daughter Sara Ali Khan | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: ఛాన్స్ వస్తే సైఫ్ కుమార్తెతో నటిస్తారా?.. కరీనా ఏం చెప్పారంటే?

Published Thu, Nov 16 2023 6:47 PM | Last Updated on Thu, Nov 16 2023 6:58 PM

Kareena Kapoor says she is open Acts with step-daughter Sara Ali Khan - Sakshi

బాలీవుడ్ భామ కరీనాకపూర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్‌ ఆలియా భట్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. 

సారా అలీఖాన్‌ (కరీనా భర్త, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్  అమృతా సింగ్‌ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. 

ఆ తర్వాత మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్‌లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్‌ యాక్టింగ్‌ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్‌ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు.

కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్  వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్‌తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో  నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement