
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. కోలార్ గనుల నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు కన్నడ స్టార్ యశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.
అయితే ఇటీవల కేజీఎఫ్ సినిమాకు మొదట అనుకున్నది యశ్ కాదంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఇవన్నీ తప్పుడు కథనాలు అంటూ కొట్టిపారేసింది. ఈ కథను యశ్ కోసమే సిద్ధం చేశామని తెలిపింది. యశ్తో తమకు దీర్ఘకాలం భాగస్వామ్యం ఉందని.. తాను మా కుటుంబంలో ఓ భాగమని పంచుకున్నారు. అతను ఎల్లప్పుడూ మా రాకీ భాయ్‌గానే గుర్తుంటాడని హోంబలే ఫిల్మ్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
కేజీఎఫ్ సినిమాలతోనే కన్నడ సినిమా పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చిందని హోంబాలే ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేజీఎఫ్ తర్వాత కాంతార లాంటి చిత్రాల విజయం కన్నడ సినిమా ఇమేజ్ను పెంచిందన్నారు. కర్ణాటక వెలుపల కన్నడ చిత్రాల గురించి చాలా మందికి తెలియదని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.
కాగా.. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా నిలిచింది. 2022లో విడుదలైన కేజీఎఫ్- 2 మరిన్ని రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది.