సినిమా తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. లాంచింగ్ దగ్గర నుంచి థియేటర్లలో రిలీజ్ చేసేంత వరకు ఏదో టెన్షన్ ఉండనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మూవీ మొదలవకుండానే ఆగిపోయిన సందర్భాలు, లేదంటే దర్శకులు, హీరోలు మారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటాయి. రీసెంట్ టైంలో అయితే రజనీకాంత్-కమల్ హాసన్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
'కూలీ' తర్వాత రజనీ.. కొత్తగా ఏ సినిమా చేస్తారా అని అభిమానులు అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా, సుందర్.సి దర్శకుడిగా మూవీ అనౌన్స్ చేశారు. ఇది జరిగి వారం పదిరోజులు కూడా కాలేదు. సుందర్.. ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు అధికారిక నోట్ కూడా రిలీజ్ చేశారు. అనివార్య కారణాల వల్లే ఇదంతా అని సుందర్ చెప్పారు. కానీ ఇప్పుడు అసలు కారణం ఏంటో కమల్ బయటపెట్టారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్!)
తాజాగా మీడియాతో మాట్లాడిన కమల్.. స్టోరీ నచ్చకపోవడం వల్ల ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చేశారు. తాను నిర్మాత అని, తన మూవీలో హీరోకు స్టోరీ నచ్చేంతవరకు వెతుకుతూనే ఉంటామని కూడా అన్నారు. అయితే ఇదేదో ప్రాజెక్ట్ ప్రకటించకముందే చేసుంటే బాగుండేది కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకు అంత తొందరపడ్డారో అని మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమాతో పాటు రజనీతో తాను నటించే మరో మూవీ కోసం కూడా స్టోరీ వెతుకుతున్నామని చెప్పి కమల్ హాసన్ చెప్పారు. మరి సుందర్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి వచ్చే దర్శకుడు ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ సాగుతోంది. టాలీవుడ్ వైపు కూడా కమల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు యంగ్, సీనియర్ డైరెక్టర్స్ ఆయా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి రజనీ-కమల్ కాంబో మూవీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్)
I’m an investor in this film and I will look for a story which my star will love. We’ll keep searching until we find it.
- Kamal Haasan about #Thalaivar173
pic.twitter.com/4gjw3Q27MZ— LetsCinema (@letscinema) November 15, 2025


