మార్క్: 200 అడుగుల పొడవైన షిప్‌లో క్లైమాక్స్‌.. | Kichcha Sudeep’s ‘Mark’ Wraps Shoot; Massive Ship Set & Song With 400 Artists | Sakshi
Sakshi News home page

Mark Movie: 400 మందితో సాంగ్‌.. పెద్ద షిప్‌లో క్లైమాక్స్‌

Nov 15 2025 8:22 AM | Updated on Nov 15 2025 11:18 AM

Kichcha Sudeep Mark Movie Shooting Completed

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌కు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం మార్క్‌. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇటీవల ఈ చిత్ర క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అందుకోసం 200 అడుగుల పొడవైన షిప్‌ సెట్‌ వేసినట్లు చెప్పారు. 

400 మందితో పాట
ఈ సెట్‌లో చిత్రీకరించిన పాటలో 100 మందికి పైగా నటీనటులు, 300 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా మార్క్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించినట్లు చెప్పారు. 

రిలీజ్‌
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీకి అజనీశ్‌ లోకనాథ్‌ సంతం అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌ చిత్రం అంటే కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మార్క్‌ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

చదవండి: పూల వ్యాపారే నిర్మాత: అర్జున్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement