సలార్ మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మలయాళ హీరో దక్షిణాదిలో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వస్తోన్న చిత్రం విలాయత్ బుద్ధా (Vilayath Buddha). ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ సరసన ప్రియంవద కృష్ణన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంతముందెన్నడు చేయని డిఫరెంట్ రోల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా మూవీ మలయాళ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలా స్టోరీ ఉండనున్నట్లు ట్రైలర్ సీన్స్ చూస్తే అర్థమవుతోంది. అడవుల నేపథ్యంలోనే ఈ కథ రూపొందించినట్లు ట్రైలర్ కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.


