పూల వ్యాపారే నిర్మాత.. ఆశ్చర్యపోయాను: అర్జున్‌ | Action King Arjun Made Interesting Comments On Mufti Police Producer | Sakshi
Sakshi News home page

పూల వ్యాపారే నిర్మాత.. ఆశ్చర్యపోయాను: అర్జున్‌

Nov 15 2025 7:07 AM | Updated on Nov 15 2025 11:25 AM

Action King Arjun Comments On mufti police producer

యాక్షన్‌ కింగ్‌ అర్జున్, నటి ఐశ్వర్య రాజేశ్‌(Aishwarya Rajesh) కలిసి నటించిన చిత్రం ‘మఫ్టీ పోలీస్‌’ (Mufti Police). దినేశ్‌ లక్ష్మణన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా  ట్రైలర్‌ (Mufti Police Trailer)ను  విడుదల చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. జీఎస్‌ ఆర్ట్స్‌ పతాకంపై అరుళ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్ర నిర్మాత కోయంబత్తూర్‌కు చెందిన పూల వ్యాపారి కావడం విశేషం. ఈ మూవీలో నటించిన ఐశ్వర్య రాజేశ్‌ మాట్లాడుతూ ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడే తన ఒళ్లు జలదరించిందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అవగాహన కలిగించేవిధంగా ఉంటుందన్నారు. ఇలాంటి యధార్థ సంఘటనతో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. నటుడు అర్జున్‌ నిజంగానే జెంటిల్‌మెన్‌ అని పేర్కొన్నారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను రెండు ఫైట్స్‌లో నటించినట్లు చెప్పారు.

నటుడు అర్జున్‌ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ చిత్ర నిర్మాత పూల వ్యాపారినని చెప్పారని తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు, అయితే ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమే నిర్మాతగా చేసిందని తెలిపారు. అందరినీ గౌరవించే ఆయన మనస్తత్వం తనకు బాగా నచ్చిందని అర్జున్‌ పేర్కొన్నారు. ఆయన మంచి మనసు కోసమే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలన్నారు. చిత్ర నిర్మాత అరుళ్‌ కుమార్‌ మాట్లాడుతూ తనకు ఒప్పందం చేసిన అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో శ్రమించారన్నారు. తాను నటుడు అర్జున్‌ వీరాభిమానినని, ఆయన నటించిన జెంటిల్‌మెన్‌ చిత్రం చూసి  అభిమానినయ్యానని చెప్పారు. అలాంటిది అర్జున్‌ హీరోగా చిత్రం చేయడం సంతోషకరం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement