
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభానికి రెడీ అయింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా ఉన్నాడు. ఈసారి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కన్నడ బిగ్‌బాస్ కొత్త సీజన్ కూడా ఇదే నెలలో షురూ అవనుంది. ఈ షో నేను చేయను, నా వల్ల కాదు అని కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) పక్కకు తప్పుకున్నాడు. కానీ, షో నిర్వాహకులు బతిమాలి మళ్లీ ఆయన్నే హోస్ట్‌గా ఒప్పించారు.
ఈ నెలలోనే..
ఈమేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక సాంప్రదాయాలు, రకరకాల మనుషులను, సినిమా, సీరియల్స్, రీల్స్.. ఇలా చాలానే చూపించారు. అవన్నీ చూస్తుండగా సడన్‌గా డిష్ పోతుంది. అప్పుడు కిచ్చా సుదీప్ కాఫీ చేత పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. సర్.. సెట్, కంటెస్టెంట్లు రెడీ, ఏడు కోట్ల కన్నడిగులు రెడీ.. మరి మీరు అని కొంత బెరుకుతో అమ్మాయి అడగ్గా నేనూ రెడీ అంటూ కాఫీ సిప్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో చెప్పాడు సుదీప్. చివర్లో సెప్టెంబర్ 28 నుంచి బిగ్‌బాస్ ప్రారంభం అని ప్రకటించారు.