
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) తల్లి సరోజ గతేడాది మరణించింది. తల్లి లేదన్న బాధ నుంచి హీరో ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. అది ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన సుదీప్ తల్లిని తల్చుకుని ఎమోషనలయ్యాడు. బాధ ఎలా ఉంటుందో అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి దాన్ని అనుభవిస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ హాల్‌లో ఓ కుర్చీలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఇంటికి వెళ్లగానే ఆ కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటోంది!

ఎమోషనల్
నా ఫోన్‌లో గ్యాలరీ ఓపెన్ చేసి ఏడాది కిందటి ఫోటోలు చూసినప్పుడు.. అమ్మతో కలిసున్న రోజులు, ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎమోషనలైపోతున్నాను. నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నాను. అన్నింటికంటే కూడా మా నాన్నను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నాను. అమ్మతో 50 ఏళ్లు కలిసున్నాడు. తనెంత కుమిలిపోతున్నాడో! ఈ బాధ భరించలేకపోతున్నాము అని చెప్పుకొచ్చాడు. కాగా సుదీప్ తల్లి సరోజా 2024 అక్టోబర్ 20న అనారోగ్యంతో కన్నుమూశారు.