
బుల్లితెర నటి కీర్తి భట్ (Keerthi Bhat) సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో తన లైఫ్ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను దత్తత తీసుకుంది. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది.
ఎన్నో కష్టాలు
ప్రేమించిన వ్యక్తి అనుమానంతో విషం కక్కుతుంటే బ్రేకప్ చెప్పి ఆ బాధ నుంచి బయటకు వచ్చింది. ఇలా ఎన్నో బాధలను పంటికింద భరిస్తూ యాక్టింగ్ అనే టాలెంట్‌నే నమ్ముతూ బతికేస్తోంది. రెండేళ్ల క్రితం కీర్తి, హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాబోయే కోడలు వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా.. మాకు పాప ఎందుకు, నువ్వే మాకు పాప.. కావాలంటే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుందాం అని విజయ్ పేరెంట్స్ కీర్తితో అన్నారు.
అత్తకు సర్‌ప్రైజ్
ఈ విషయాన్ని కీర్తి ఓ షోలో చెప్తూ.. అలాంటి అత్తమామలు దొరకడం తన అదృష్టం అంటూ వారిలోనే తన పేరెంట్స్‌ను చూసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా తనకు కాబోయే అత్తకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె పుట్టినరోజునాడు చిన్న ప్రైవేట్ థియేటర్ బుక్ చేసింది. అక్కడికి అత్తమామను తీసుకెళ్లి వారితో కేక్ కట్ చేయించింది. తర్వాత వాళ్లతో కలిసి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే అత్తమ్మా.. నీ నవ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని కీర్తి క్యాప్షన్ ఇచ్చింది.
చదవండి: బిగ్‌బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్!