బిగ్‌బాస్‌ నుంచి ఇద్దరు అవుట్‌.. ఈ షోకి పనికిరావంటూ రెడ్‌ కార్డ్‌! | Bigg Boss 9 Agnipariksha: Prasanna Kumar, Swetha Shetty Eliminated | Sakshi
Sakshi News home page

Bigg Boss 9 Agnipariksha: నేను రియాలిటీ షో గెలిచా.. కానీ నువ్వు రియాలిటీ గెలిచావంటూ అభిజిత్‌ ప్రశంసలు

Sep 3 2025 1:37 PM | Updated on Sep 3 2025 1:44 PM

Bigg Boss 9 Agnipariksha: Prasanna Kumar, Swetha Shetty Eliminated

మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్‌ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇంకా కంటెస్టెంట్ల ఎంపికపై టీమ్‌ తర్జనభర్జన పడుతూనే ఉంది. మొదటినుంచి నేను రెడీ అంటూ ముల్లెమూట సర్దేసుకున్నవారు పారితోషికం, నెగెటివిటీ గురించి ఆలోచించి ఓ అడుగు వెనక్కు వేస్తున్నారు. మరికొందరేమే ఓసారి ట్రై చేస్తే పోలా అని షోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇద్దరు ఎలిమినేట్‌
ఇదిలా ఉంటే కామన్‌ మ్యాన్‌ కోసం బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 15 మందిని సెలక్ట్‌ చేశారు. వారిలో ఐదుగురిని హౌస్‌కు పంపించనున్నారు. జడ్జిలు బిందుమాధవి, నవదీప్‌, అభిజిత్‌.. వారిని సానబెట్టి రాటుదేలుస్తున్నారు. అలాగే సరిగా పర్ఫామెన్స్‌ ఇవ్వనివారిని బయటకు పంపించేస్తున్నారు. అలా లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ప్రసన్నకుమార్‌, శ్వేతను ఎలిమినేట్‌ చేశారు. 

ఈ పంచాయితీ సెట్టవదు
అయితే ప్రసన్నకు రెడ్‌ కార్డ్‌ ఇవ్వగానే అతడు నా జర్నీ ఇంతటితో ఆగిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడున్న అందరికంటే నువ్వు వెయ్యి రెట్లు స్ట్రాంగ్‌.. నిన్ను చూసి నేను కూడా ఇన్‌స్పైర్‌ అయ్యా.. కానీ, ఈ షో నీ వల్ల కాదు, ఈ లొల్లి, ఈ పంచాయితీ నీతో కాదు.. అని నవదీప్‌ చెప్పాడు. అభిజిత్‌ సైతం.. నేను రియాలిటీ షో గెలిచుండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని అభినందించాడు.

చదవండి: మర్యాదగా నా ఫోటోలను డిలీట్‌ చేయండి: హీరోయిన్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement