టాక్సిక్‌ ఆరంభం | Yash Toxic Launched With Customary Pooja In Bengaluru | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ ఆరంభం

Aug 9 2024 12:42 AM | Updated on Aug 9 2024 12:42 AM

Yash Toxic Launched With Customary Pooja In Bengaluru

యశ్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. 

గురువారం బెంగళూరులో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘‘8.8.8న ఈ సినిమాను ఆరంభించాం. న్యూమరాలజీ ప్రకారం ఇది యశ్‌ బర్త్‌ డే (జనవరి 8)ని కూడా సూచిస్తుంది. పవర్‌ఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ కథతో ‘టాక్సిక్‌’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్‌ నటీనటులు నటిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement