
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాండల్‌వుడ్ హీరో యశ్. ప్రస్తుతం ఆయన టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది.
అయితే తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ బర్త్ డే పార్టీకి హాజరైన కేజీఎఫ్ స్టార్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్ రాకింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.
వివాదంలో టాక్సిక్ టీమ్
యశ్ నటిస్తోన్న టాక్సిక్ టీమ్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్‌గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి.ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరంగా నిలిచిపోయింది.
Rocking Star @TheNameIsYash bringing all the energy, dancing to Century Star @NimmaShivanna 's hit "Tagaru Bantu Tagaru" at Yatharv’s birthday party.#YashBoss #Shivanna pic.twitter.com/pM1mM413NZ
— Bhargavi (@IamHCB) October 31, 2024