
'కేజీఎఫ్' పేరుతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గుర్తొస్తారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో వీళ్ల కెరీరే మారిపోయింది. ప్రస్తుతం నీల్.. తారక్ తో మూవీ చేస్తుండగా, యష్ 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. భారీ స్థాయిలో తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో షూటింగ్ వల్ల ఈ మూవీ వివాదంలోనూ చిక్కుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వస్తామని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)
మార్చిలో అంటే పరీక్షల సీజన్. అయినా సరే యష్ వస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. మరోవైపు తర్వాత వారమే అంటే మార్చి 26న నాని 'ప్యారడైజ్' రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టుని కూడా 26నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం 'టాక్సిక్' వల్ల చరణ్ కి కాస్త ఇబ్బంది ఉండొచ్చు.
ఎందుకంటే యష్, చరణ్.. ఇద్దరివీ పాన్ ఇండియా మూవీసే. వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజై హిట్ అయితే పర్లేదు. లేదంటే మాత్రం ఒకరి వల్ల మరొకరికి వసూళ్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉండొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా)
