కేజీఎఫ్ హీరో యశ్ (yash) తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రముఖ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫర్ భూవన్ గౌడ వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించిన యశ్.. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ఎంటర్‌ప్రెన్యూరర్ నిఖితను పెళ్లాడారు. భువన్ గౌడ, నికిత వివాహానికి కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
కాగా..హీరో యశ్, భువన్ గౌడ కేజీఎఫ్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ సినిమాలకు గానూ అతను ప్రశంసలు అందుకున్నారు. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ చిత్రానికి కూడా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీకి కూడా భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. అంతేకాకుండా కన్నడలో 'లోడ్డే', 'రథావర', 'భరాతే' వంటి చిత్రాలకు పనిచేశాడు.
కాగా.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేజీఎఫ్ హీరో యశ్ (yash) ప్రస్తుతం టాక్సిక్(toxic) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


