హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్! | Yash Fans Trolling Actor Raviteja For Comments | Sakshi
Sakshi News home page

Raviteja-Yash: రవితేజ కామెంట్స్.. వాళ్లకు అలా అర్థమయ్యాయ్!

Published Wed, Oct 11 2023 8:02 PM | Last Updated on Wed, Oct 11 2023 8:17 PM

Yash Fans Trolling Actor Raviteja For Comments - Sakshi

తెలుగు హీరో రవితేజపై 'కేజీఎఫ్' ఫేమ్ యష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోనే అలా అంటావా అని రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది?

రవితేజ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ అద్భుతమైన యాక్టర్. హిట్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం. దీంతో దేశమంతటా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

యష్-'కేజీఎఫ్'పై కామెంట్స్
రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్​ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని రవితేజ చెప్పాడు.  కన్నడ హీరో యశ్ గురించి అడిగితే.. అతడు యాక్ట్ చేసిన 'కేజీఎఫ్' మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం అతడికి చాలా లక్కీ' అని అన్నాడు. దీన్ని తీసుకోలేకపోతున్న యష్ ఫ్యాన్స్.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 'కేజీఎఫ్' తప్పితే యష్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో ఇలా అ‍న్నాడు. యష్ అభిమానులు మాత్రం దీన్ని అపార్థం చేసుకుని గొడవ గొడవ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement