'టాక్సిక్‌' అధికారిక ప్రకటన.. ప్రభాస్‌తో పోటీ తప్పదా..? | Yash Toxic Movie Officially Announced | Sakshi
Sakshi News home page

'టాక్సిక్‌' అధికారిక ప్రకటన.. ప్రభాస్‌తో పోటీ తప్పదా..?

Aug 8 2024 11:11 AM | Updated on Aug 8 2024 11:49 AM

Yash Toxic Movie Officially Announced

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కొత్త సినిమా ‘టాక్సిక్‌’ అధికారికి ప్రకటన వచ్చేసింది. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  కెవిఎన్ ప్రొడక్షన్స్‌ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందని యశ్‌ తెలిపారు. యశ్‌కు నంబర్‌ 8 అంటే చాలా సెంటిమెంట్‌. అందువల్లే నేడు (8-8-2024) టాక్సిక్‌ సెట్‌లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

వేగంగా షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  యశ్‌ ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు అయినా, ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ వల్ల భారీ విజయాలను అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార భాగం కానున్నట్లు  కన్నడ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఇదే క్రమంలో కియారా అద్వానీ, శ్రుతీహాసన్‌ వంటి స్టార్స్‌ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల పేర్లు త్వరలో ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

ఏప్రిల్‌ 10న టాక్సిక్‌ విడుదల అయితే ప్రభాస్‌తో పోటీ తప్పదు. అదేరోజున మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమా కూడా విడుదల కానుంది. రీసెంట్‌గా గ్ల్సింప్స్‌ కూడా మేకర్స్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్త చాటుతున్న ప్రభాస్‌ సినిమాకు పోటీగా టాక్సిక్‌ విడుదల కాకపోవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement