
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్–అప్స్’. ఈ ద్విభాషా(ఇంగ్లిష్, కన్నడ) చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ ‘టాక్సిక్’ సినిమాకు వర్క్ చేస్తున్నారు.
తన హాలీవుడ్ స్టంట్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ‘టాక్సిక్’ కోసం 45రోజుల సుదీర్ఘమైన యాక్షన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబైలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్‌లో పెర్రీ తన రెగ్యులర్ స్టంట్ టీమ్‌ని పక్కన పెట్టి, ఇండియన్ స్టంట్ టీమ్‌తో వర్క్ చేయనుండటం విశేషం.
ఈ అంశంపై జేజే పెర్రీ మాట్లాడుతూ–‘‘నా 35 ఏళ్ల కెరీర్‌లో 39 దేశాల్లో పని చేశాను. భారతీయ సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పది. మా అమెరికన్ కల్చర్ కొన్ని వందల ఏళ్ల క్రితంనాటిదే. భారతీయ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. ఇండియన్ స్టంట్ టీమ్ వరల్డ్ క్లాస్‌గా ఉంది. ‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు.