కేజీఎఫ్‌ హీరో సూపర్‌ హిట్‌ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే? | Sandalwood Hero Yash New Movie Release in telugu In this month | Sakshi
Sakshi News home page

Yash: టాలీవుడ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. యశ్ హిట్‌ మూవీ రిలీజ్‌!

Jun 10 2024 4:10 PM | Updated on Jun 10 2024 4:19 PM

Sandalwood Hero Yash New Movie Release in telugu In this month

కేజీఎఫ్‌ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్‌ మంచి సందేశం ఇ‍చ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement