రాకీ భాయ్‌తో ‘సలార్‌’భామ రొమాన్స్‌ | Sakshi
Sakshi News home page

Shruti Haasan: రాకీ భాయ్‌తో ‘సలార్‌’భామ రొమాన్స్‌

Published Thu, Dec 14 2023 9:16 AM

Shruti Haasan Plays Key Role In KGF Fame Yash Latest Movie Toxic - Sakshi

ఇంద్ర మహేంద్రజాలం సినిమా. లక్‌ అనేది ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. వరించినప్పుడు సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. నటి శృతిహాసన్‌ పరిస్థితి ఇదే. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటీమణుల్లో ఈమె ఒకరు. ఈ బ్యూటీ చర్యలన్నీ నిర్భయంగా ఉంటాయి. వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానే శృతిహాసన్‌ బాణీ ఇదే. తమిళంలో కంటే తెలుగులో అధిక హిట్‌ చిత్రాలలో నటించిన ఈ బ్యూటీకి మొన్నటి వరకూ సలార్‌ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 22న సలార్‌ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

దీంతో ఒక్క ఆంగ్ల చిత్రం మాత్రమే చేతిలో ఉన్న నటి శృతిహాసన్‌కు నెక్ట్స్‌ ఏమిటి? అనే ప్రశ్న తలెత్తింది. అలాంటి ఇప్పుడు ఏకంగా రెండు చిత్రాల అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగులో అడవి శేష్‌ సరసన ఒక చిత్రంలో నటించనున్నారు. ఇక తాజాగా మరో పాన్‌ ఇండియా చిత్రంలో నాయకిగా నటించే అవకాశం వరించింది. కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ యశ్‌తో జత కట్టబోతున్నారు. కేజీఎఫ్‌ సీక్వెల్‌ తరువాత చిన్న గ్యాప్‌ తీసుకుని యాష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి టాక్సీ అనే టైటిల్‌ను కూడా ఇటీవలే ప్రకటించారు.

కేవీఎన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం యశ్‌కు 19 చిత్రం కావడం గమనార్హం. గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. కాగా అందులో నటి సాయిపల్లవి ఒకరుగా ఇప్పటికే ప్రచారంలో ఉంది.తాజాగా మరో కథానయకిగా శృతిహాసన్‌ ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇక మరో హీరోయిన్‌ ఎంపిక జరుగుతోందని సమాచారం. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement