కేజీఎఫ్ హీరో టాక్సిక్‌పై రూమర్స్.. నిర్మాతలు ఏమన్నారంటే? | Clatiry on Yash Latest Movie Toxic Postponed | Sakshi
Sakshi News home page

Toxic Movie: యశ్ టాక్సిక్‌పై రూమర్స్.. నిర్మాతలు ఏమన్నారంటే?

Oct 30 2025 5:06 PM | Updated on Oct 30 2025 5:16 PM

Clatiry on Yash Latest Movie Toxic Postponed

కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తోన్న మోస్ట్‌ అవైటేడ్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ కోసం యశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌-2 రిలీజై ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. దీంతో టాక్సిక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ మూవీపై కొన్ని రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. టాక్సిక్‌ రిలీజ్‌ వాయిదా పడనుందని తెగ టాక్ నడుస్తోంది. దీంతో యశ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మేకర్స్ స్పందించారు. తమ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టాక్సిక్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇంకా 140 రోజులే.. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ సందడి చేయనుందని వెల్లడించారు. తరణ్  ఈ ప్రకటనతో గత కొద్ది కాలంగా వస్తున్న వాయిదా రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

కాగ.. టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నుంచే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో భాగంగా వీఎఫ్ఎక్స్ ప‌నులు ప్రారంభ‌మ‌మైనట్లు తెలుస్తోంది. మ‌రో వైపు య‌శ్ ప్రస్తుతం ముంబయిలో రామాయ‌ణ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. టాక్సిక్ సినిమాకు సంబంధించి  వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్రమోషన్స్‌ ప్రారంభించనున్నట్లు టాక్. ఈ సినిమా క‌న్న‌‌డతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డబ్‌ చేసి రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement