టాక్సిక్‌లో..? | Nayanthara Joins Yash Toxic As Kareena Kapoor Walks Out | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌లో..?

May 4 2024 12:17 AM | Updated on May 4 2024 11:35 AM

Nayanthara Joins Yash Toxic As Kareena Kapoor Walks Out

యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమాలో నయనతార భాగం కానున్నారా? అంటే అవుననే టాక్‌ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌’. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్‌ వంటి స్టార్స్‌ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది.

దీనికి తోడు తాను సౌత్‌ సినిమా అంగీకరించినట్లు ఆ మధ్య కరీనా స్వయంగా వెల్లడించారు. అది ‘టాక్సిక్‌’ సినిమానే అనే ప్రచారం సాగింది. అయితే తాజాగా షూటింగ్‌ కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి కరీనా కపూర్‌ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్లేస్‌లో నయనతారను తీసుకోవాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 2010లో ఉపేంద్ర నటించిన ‘సూపర్‌’ కన్నడలో నయనతారకు తొలి సినిమా. వార్తల్లో ఉన్న ప్రకారం నయనతార ‘టాక్సిక్‌’ సినిమా చేస్తే.. పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కన్నడ సినిమా చేసినట్లవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement