
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ, స్నేహం, కోపం లాంటివి ఉండనే ఉంటాయి. అయితే ఎప్పుడు ఎలా ఉండాలనేది ఆయా వ్యక్తుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే తన జీవితంలో తాను చేసిన ఓ పని ఇప్పటికీ బాధపెడుతూనే ఉంటుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ మర్చిపోలేని బాధ అదొక్కటేనని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్‌గా 'కిష్కింధపురి' మూవీ సక్సెస్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.
'మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఫ్యామిలీ, ప్రేమ, స్నేహంలో పట్టువిడుపులతో ఉండాలి. కోపాన్ని మనసులో పెట్టుకుంటే చివరకు అంతులేని విషాదమే మిగులుతుంది. నాకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం క్రితం మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అతడితో మాట్లాడటం మానేశాను. అయినా చాలాసార్లు నాకు మెసేజ్ చేసేవాడు'
(ఇదీ చదవండి: రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్)
'అనవసరమైన గొడవలు ఎందుకని అతడి మెసేజులకు నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు. అలానే ఓసారి మెసేజ్ చేశారు. నేను పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల తర్వాత అతడు చనిపోయాడనే విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యాను. ఒక్కోసారి మనల్ని ప్రేమించే వాళ్లతో మనస్పర్థలు జీవితాంతం విషాదాన్ని మిగులుస్తాయి' అని అనుపమ చెప్పుకొచ్చింది.
వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలతో అనుపమ.. ప్రేక్షకుల్ని పలకరించింది. ఆగస్టులో 'పరదా' మూవీతో వచ్చింది. పదిరోజుల క్రితం 'కిష్కింధపురి' అనే హారర్ చిత్రంతో వచ్చింది. ఈ రెండింటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'లోక'.. దుల్కర్ ట్వీట్‌తో క్లారిటీ)