
తమన్నా భాటియా స్పెషల్ సాంగ్స్ అంటే గ్లామర్, ఎనర్జీ, స్టైల్ అన్నీ కలబోసి ఉంటుంది. ఇప్పటికే ఆమె చేసిన కొన్ని స్పెషల్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసేలా చేశాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తెరకెక్కించిన 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో మిల్కీ బ్యూటీ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అవుతుంది. ఇందులో ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచేశారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ సాంగ్ కోసం ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.
ఇటీవల వచ్చిన ‘స్త్రీ 2’ సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తమన్నా (Tamannaah).. ఆ తర్వాత అదే జోష్‌తో ‘రైడ్ 2’లో మరో హిట్ సాంగ్‌తో అలరించింది. తాజాగా 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లో మరింత గ్లామర్‌గా కనిపించి స్టెప్పులేసింది. ఈ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న నటిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది.
తమన్నా ప్రస్తుతం ఒక సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన ఓదెల 2 సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం ఉంది. అలాగే, "రైడ్ 2" సినిమాలో "నషా" అనే ఐటమ్ సాంగ్ కోసం ఆమె రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. జైలర్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ కోసం ఆమెకు రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ అందినట్లు కోలీవుడ్ వర్గాల్లో సమాచారం ఉంది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ కేవలం 3 నిమిషాల సాంగ్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్‌లో వైరల్ అవుతుంది.