బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu)లో మాధురి ( Madhuri) కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. అయితే, హౌస్లో ఉన్నన్నిరోజులు తనదైన రీతిలో ముద్రవేశారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి, తనను కలిపి ట్రోల్ చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుకు దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు.
భరణితో మీమ్స్.. భగ్గుమన్న మాధురి
బిగ్బాస్లో మాధురి ఉన్నన్నిరోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే, హౌస్లో ఉన్నది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్‌బాస్‌కు సరెండర్ అయి గేమ్ ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే.. ఆమె హౌస్లో ఉండగా కొందరు అదేపనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటిపై ఆమె ఇలా ఇరుచుకుపడ్డారు. 'సోషల్మీడియాలో కొందరు బుద్దిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ వేశారు. 
దీపావళి పండగ సందర్బంగా హోస్ట్ నాగార్జున చెబితేనే భరణితో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే రెండు స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాతినీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా..? నాపై ఎవడైతే ట్రోల్స్ చేశాడు వాడు మనిషి కాదు.. ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడూ కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడు.' అని ఆమె ఆవేదన చెందారు.
భరణి రీఎంట్రీ వెనుక నాగబాబు
బిగ్బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారు. హౌస్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో ఎక్కువగా బాండింగ్స్ పెట్టుకోవడం ప్రేక్షకులకు నచ్చేలేదు. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని హౌస్ట్ నాగార్జున కూడా చెప్పారు. దీంతో ఆయన 7వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ, భరణిని హౌస్లోకి పంపారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్‌బాస్ చెప్పారు. అయితే, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు. 
కానీ, ఫైనల్‌గా ఆ ఛాన్స్ భరణికి దక్కింది. ఈ అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులు భరణికి ఉన్నాయని.., అందుకే నాగబాబుకు రెండో ఛాన్స్ ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్ అయింది. భరణి రీఎంట్రీ కోసం తనను బలి చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీపై చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు.
భరణి కోసం ట్వీట్ వేసిన నాగబాబు
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి.' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
తనూజ విన్నర్ అవుతుంది
బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె సేఫ్ గేమ్ ఆడటం లేదని క్లారిటీ ఇచ్చారు. 'వాస్తవంగా ఎలిమినేషన్ రౌండ్‌లో నన్ను సేవ్ చేస్తానని తనూజ కోరింది. నేను వద్దని చెప్పాను. గౌరవ్‌కు గేమ్ ఆడాలని ఆశ ఉంది కాబట్టి తనను సేవ్ చేయమని తనూజను కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజకు చెప్పాను. ఎట్టిపరిస్థితిల్లోనూ నన్ను సేవ్ చేయవద్దని ఒట్టు కూడా తనూజతో వేయించుకున్నాను.' అని మాధురి చెప్పారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
