తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు, రణరంగమే అన్న ట్యాగ్‌లైన్‌కు నేటి ఎపిసోడ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. రీఎంట్రీ కోసం శ్రీజ, భరణి.. ఇద్దరు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ హౌస్‌మేట్స్‌లో నుంచి కొందరిని ఎన్నుకుని రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుంది. ఆ టీమ్ మెంబర్స్ ఆయా కంటెస్టెంట్ కోసం గేమ్ ఆడి గెలవాలి.
కంటెస్టెంట్స్‌కి దెబ్బలు
రీఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఏదో మామూలు టాస్క్‌లకు బదులుగా మంచి టాస్కులే ప్లాన్ చేశారు. అలా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) పెట్టిన గేమ్‌లో హౌస్‌మేట్స్ కిందామీదా పడి ఆడి, దెబ్బలు తగిలించుకుని గాయపడ్డారట! భరణిని అయితే ఏకంగా గాయంతో హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏమైనా ఫ్రాక్చర్ అయ్యారా? అని హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కానింగ్స్ చేయించారు.
మట్టికరిపించిన పవన్
అక్కడ బానే ఉందని రిపోర్ట్స్ రావడంతో తిరిగి అతడిని హౌస్‌కు పంపించారు. అయితే అందరి ఆట ఒకెత్తయితే.. డిమాన్ పవన్ ఆట మాత్రం మరో ఎత్తు. చేతులతో నిఖిల్‌ను కట్టడి చేస్తే కాళ్లతో భరణిని లాక్ చేసి ముందుకెళ్లనివ్వలేదు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీలను ఒక్కడే కట్టడి చేయమనేది మామూలు విషయం కాదు. ఇప్పుడనే కాదు, పవన్ తనకు ఏ టాస్క్ ఇచ్చినా సరే గట్టిగా ఆడతాడు. గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు.
తోపు కంటెస్టెంట్.. కానీ!
ఫిజికల్ టాస్క్‌లో తాండవం చూపిస్తాడు. కానీ, రీతూతో లవ్ ట్రాక్ వల్ల పవన్‌పై జనాల్లో చిన్నచూపు ఉంది. అటు బిగ్‌బాస్ టీమ్, నాగార్జున కూడా అతడిని ఎక్కువగా హైలైట్ చేయరు. ఆ ట్రాక్ గనక లేకుంటే పవన్ కూడా టాప్ 3 రేసులో ఉండేవాడే! మరి శ్రీజను గెలిపించడం కోసం దెబ్బలు తగిలించుకుని మరీ ఆడుతున్నాడు. అతడు కోరుకున్నట్లుగా శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా? వీకెండ్‌లో నాగార్జున.. పవన్ ఆటను మెచ్చుకుంటాడా? చూడాలి!


