breaking news
hyderabd film nagar
-
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్.. వేదికలు ఇవే..!
హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్‌కు వేదికగా నిలవనుంది. ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగ్యనగరంలో జరగనుంది. ఈ ఏడాది 30వ ఎడిషన్‌లో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్, సారథి స్టూడియోస్‌లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ జెల్లే డే జోంగ్ తెరకెక్కించిన మేమెరీ లేన్ అనే మూవీతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.హైదరాబాద్ వేదికగా ఈ నెల 5 నుంచి 14వరకు జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో యూరప్ దేశాల్లో తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రదర్శించనున్నారు. బెల్జియం మూవీ జూలీ క్వీప్ క్వైట్.. ఆస్ట్రియా చిత్రం హ్యాపీలో లాంటి సినిమాలు తెరపై ఆవిష్కరించనున్నారు. అలాగే పలు దేశాలకు సంబంధించిన సూపర్ హిట్ చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారని యూరోపియన్ యూనియన్ రాయబారి హార్వే డెల్ఫిన్ వెల్లడించారు. ఈయూఎఫ్ఎఫ్-2025లో దాదాపు 23 దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఫిలింనగర్లో రేషన్ దుకాణం సీజ్
హైదరాబాద్: సరుకుల పంపిణీలో అవకతవకలు, నిల్వ వివరాలు సరిగా లేకపోవడంతో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని నంబర్ 831 రేషన్‌షాప్‌ను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల నుంచి పలు ఆరోపణలు రావటంతో రేషనింగ్ సర్కిల్-7 అధికారులు గౌతంనగర్ బస్తీలో ఉన్న ఈ దుకాణంపై బుధవారం దాడులు జరిపారు. రికార్డులను పరిశీలించారు. స్టాక్ రిజిష్టర్ పూర్తిగా అవకతవకలతో ఉంది. బాలాజీ అనే డీలర్ పేరుతో ఉన్న ఈ షాపును మిషాక్ అనే వ్యక్తి బినామీగా నడిపిస్తున్నాడు. షాప్‌ను సీజ్ చేసిన అనంతరం ఏఎస్వో ప్రభాకర్ కార్డుదారులకు సమీపంలో ఉన్న మరో షాప్‌ను కేటాయించారు. మూడు రోజుల పాటు ఇదే షాపు నుంచి సరుకులు పంపిణీ అవుతాయని చెప్పారు. అనంతరం భగత్‌సింగ్ కాలనీలో ఉన్న షాప్‌నంబర్ 814 నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని కార్డుదారులకు సూచించారు.


