హేట్‌ టు లవ్‌.. నాలుక మడతేసిన ట్రంప్‌ | Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour | Sakshi
Sakshi News home page

హేట్‌ టు లవ్‌.. నాలుక మడతేసిన ట్రంప్‌

Published Fri, Sep 6 2024 7:15 PM | Last Updated on

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour1
1/10

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన నాలుక మడతేశారు. ఒకప్పుడు దేనైనేతే అగ్రరాజ్య భద్రతకు ముప్పుగా ఆయన గగ్గోలు పెట్టారో.. ఇప్పుడు దాన్నే ఆయన అమితంగా ఇష్టపడుతున్నారు. అందుకే దాని పరిరక్షణకైనా తనకు అధికారం కట్టబెట్టాలని అమెరికన్లను కోరుతున్నారు.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour2
2/10

అదొక చైనా యాప్‌. ఎంత మాత్రం సురక్షితం కాదు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. ఈ హెచ్చరికను అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు ధృవీకరించాయి. అందుకే టిక్‌టాక్‌ను అమెరికాలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ ద్వారా బ్యాన్‌ చేస్తున్నాం :::2020లో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్ట్‌ ట్రంప్‌

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour3
3/10

అమెరికాలో ఓవైపు టిక్‌టాక్‌ కథను ముగించాలని చూస్తున్నారు. కానీ, ఆ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు నేనొక బిగ్‌ స్టార్‌ను. అమెరికాలో టిక్‌టాక్‌ను రక్షించాలనుకునేవాళ్లంతా ట్రంప్‌కు ఓటేయాలి :::అమెరికా అధ్యక్ష రేసులో అభ్యర్థిగా ట్రంప్‌ తాజా మాట

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour4
4/10

గతంలో అధ్యక్షుడిగా దేనిమీద అయితే విద్వేషం ప్రదర్శించి నిషేధం విధించాడో.. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌ కోసం పోరాటం చేస్తానంటున్నాడు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour5
5/10

మొన్న ఏప్రిల్‌లో బైడెన్‌ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. టిక్‌టాక్‌ మాతృక సంస్థ బైట్‌డాన్స్‌కు ఆ బిల్లు ద్వారా ఒక అల్టిమేటం జారీ చేసింది. టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన కంపెనీకి అమ్మేయాలని లేదంటే అమెరికాలో నిషేధం ఎదుర్కోవాలని అందులో స్పష్టం చేసింది.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour6
6/10

పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్‌ యాప్‌ చైనా ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉందన్న అనుమానాల నడుమ.. 2020లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌ ఆ యాప్‌పై నిషేధం విధిస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour7
7/10

అయితే.. అమెరికా న్యాయస్థానంలో బైట్‌డాన్స్‌కు ఊరట లభించింది. అయినప్పటికీ అమెరికా సైన్యంలో, ఇతర ప్రభుత్వ సంబంధిత విభాగాలకు చెందిన డివైస్‌లలో మాత్రం ఆ యాప్‌ వాడకంపై నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour8
8/10

అమెరికాలో.. ముఖ్యంగా యువతలో టిక్‌టాక‌కు విపరీతమైన ఆదరణ ఉంది. కిందటి ఏడాది నిర్వహించిన ఓ ఎగ్జిట్‌పోల్స్‌లో కేవలం 30 శాతం మంది మాత్రమే దాని బ్యాన్‌కు అనుకూలంగా ఓటేశారు.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour9
9/10

అమెరికాలో టిక్‌టాక్‌కు ఉన్న ఆదరణను పసిగట్టిన ట్రంప్‌ ఈ ఏడాది జూన్‌లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టాడు. ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ట్రంప్‌కు 10 మిలియన్లకు(కోటిమందికి) పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

Trump Loves Tik Tok Once Hater Now Turns Saviour10
10/10

ఒకప్పుడు టిక్‌టాక్‌ పాలిట యమకింకరుడిగా మారిన ట్రంప్‌.. ఇప్పుడు అదే యాప్‌ కోసం సేవియర్‌ అవతారం ఎత్తాడు.

Advertisement
Advertisement