ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా | Rakasa Movie Trending On Netflix OTT Platform, The Mischievous Monster Who Turned Chaos Into Comedy | Sakshi
Sakshi News home page

Rakasa In OTT: ఓటీటీలో ఆదరణ దక్కించుకుంటున్న తెలుగు మూవీ

May 10 2026 9:15 PM | Updated on May 11 2026 4:35 PM

Rakasa Movie Trending On Netflix

మెగాడాటర్ నిహారిక నిర్మించిన హారర్ కామెడీ సినిమా 'రాకాస'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్‌గా ఓటీటీలోకి కూడా వచ్చి అందులోనూ దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది. 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.

సంగీత్ శోభన్ –గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి. పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. ఈ మూవీ మానస శర్మ దర్శకురాలు కాగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. 

(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)

Advertisement
 
Advertisement
Advertisement