‘దేవా’ చిత్రంలో నటించిన మోడల్ రోహుల్లా మెహ్దీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 28 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దహిసర్ చెక్ నాకా వద్ద డ్రగ్స్ సరఫరా చేసేందుకు రోహుల్లా మెహ్దీ రానున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కాంబ్లే ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సమాచారం అందిన విధంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెహ్దీ, అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి ఐదు రోజులు రిమాండ్ విధించినట్లు సమాచారం.
ఎవరీ రోహుల్లా మోహ్దీ..
రోహుల్లా మెహ్దీ జమ్మూకాశ్మీర్‌లోని బుద్దామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ముంబైలోని గోరేగావ్ నివసిస్తున్నట్లు వెల్లడించారు. నటుడిగా, మోడల్‌గా రాణిస్తున్న మోహ్దీ.. షాహిద్ కపూర్ నటించిన ‘దేవా’ చిత్రంలోనూ కనిపించాడు. పలు వెబ్‌సరీస్‌లోనూ నటించాడు.
ఇదీ చదవండి: వరుసగా విలన్ పాత్రలు.. బాబీ డియెల్ రియాక్షన్ ఇదే..


