
బనాన ఏఐ శారీ ట్రెండ్
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్‌లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.
ఏఐ ప్రాంప్ట్‌లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.
ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్‌లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.
మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటున్నారా?
అయితే ఇలా చేయండి...
∙జెమిని చాట్‌జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్‌పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్‌లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది.