Podcast: యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్‌ - ట్రెండింగ్‌ పాడ్‌కాస్టింగ్‌! | Podcast: A digital audio or video program trending now | Sakshi
Sakshi News home page

Podcast: యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్‌ - ట్రెండింగ్‌ పాడ్‌కాస్టింగ్‌!

May 29 2025 12:00 PM | Updated on May 29 2025 12:32 PM

Podcast: A digital audio or video program trending now

శ్రీనగర్‌కాలనీ:  ఓ వ్యక్తి అనుభవాలు.. ఎదుర్కొన్న కష్టాలు.. సాధించిన విజయాలు.. పలువురికి ఉపయోగ పడే సంఘటనలు.. ఇలా ఎన్నో అంశాలను తెలుసుకోవడానికి పేపర్‌ చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడటం చేసేవాళ్లం. ఆయా అంశాల గురించి తెలుసుకునేవారం.

ఇప్పుడంతా ఫోనే.. తింటున్నా.. నడుస్తున్నా.. జర్నీ చేస్తున్నా.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫోన్‌.. ఒక్కసారి యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌ తదితర యాప్స్‌ ఓపెన్‌ చేస్తే చాలు వేలు, లక్షల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్‌(Podcast) ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇది కొన్నేళ్ల క్రితమే మొదలైనా ప్రస్తుతం పాడ్‌కాస్టింగ్‌ అంటే అందరికీ తెలుస్తోంది. ఇంటర్వ్యూ ట్రెండ్‌ అవ్వాలంటే పాడ్‌కాస్టింగ్‌తోనే అన్నట్లుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడాది కాలంగా మరింత ట్రెండింగ్‌గా మారి సెలెబ్రిటీస్‌తో పాడ్‌కాస్టింగ్‌ కోట్లలో వ్యూస్‌ని తెచ్చిపెడుతోంది. 

యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్‌.. భారత్‌లో పాడ్‌కాస్టింగ్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫుడ్, బిజినెస్, పొలిటికల్, ఎంటర్‌టైన్‌మెంట్, సైన్స్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో రాణించిన వారు తమ అనుభవాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడిస్తున్నారు. ఇందులో వీడియో పాడ్‌కాస్టింగ్‌ చాలా పాపులర్‌ అయ్యింది. ఒక యూట్యూబర్‌ లేక ఒక వ్యక్తి ఫేమస్‌ పర్సన్‌ను వారి అనుభవాలను విశ్లేషణాత్మకంగా, పూర్తిగా వారి అనుభవాలను నెటిజన్లను తెలియజేయడం ట్రెండింగ్‌గా మారింది. ఫేమస్‌ పర్సనాలిటీస్‌ వారి జీవిత విషయాలను పాడ్‌కాస్టింగ్‌లో వెల్లడించడంతో యూట్యూబ్, ఇతర సోషల్‌ మీడియాల్లో కోట్లలో వ్యూస్‌ వస్తున్నాయి. అంతేకాకుండా చానల్స్‌కి కూడా రూ.లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. 

ఇదీ చదవండి: చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా

పాడ్‌కాస్టింగ్‌.. 
పాడ్‌కాస్టింగ్‌ అంటే ఒక వ్యక్తి తన విజ్ఞానాన్ని, పలు విషయాలను పూర్తిగా వివరించే పక్రియే పాడ్‌కాస్టింగ్‌.. ఆడియో, వీడియో, మోనో, గ్రూప్‌ పాడ్‌కాస్టింగ్‌ చాలా రూపాల్లో ఉంటుంది. ఒకప్పుడు రేడియోలో ఒక వ్యక్తి తన రంగానికి సంబందించిన విషయాలను వెల్లడించడమే ఇప్పుడు రికార్డింగ్‌ రూపంలో ఒక క్లారిటీ ఆడియో, వీడియోను చేయడమే.. ఆడియో పాడ్‌కాస్టింగ్‌ చాలా తక్కువ టైంలో అవుతుంది. అదే గ్రూప్, ఇద్దరు వ్యక్తుల పాడ్‌కాస్టింగ్‌ వీడియో  పాడ్‌కాస్టింగ్‌ చేయాలంటే మైక్స్, మ్యూజిక్, ఎడిటింగ్‌ ఖచ్చితంగా చేయాలి.  

చదవండి: పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement