
వైరల్ డ్యాన్స్ ట్రెండ్
పడవ స్పీడుగా దూసుకెళుతోంది.
ఆ స్పీడ్‌కు తగినట్లుగా దిఖా చేసిన మ్యాజిక్ డ్యాన్స్ సంచలనం సృష్టించింది. ఈ ఆన్‌లైన్ సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పదకొండు సంవత్సరాల ఇండోనేషియా అబ్బాయి రెయాన్ అక్రన్ దిఖా చేసిన ఐకానిక్ బోట్ డ్యాన్స్ ‘ఆరా ఫార్మింగ్’ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. తాజాగా ఈ ట్రెండ్‌లో సింగపూర్ నేవీ సిబ్బందితో పాటు మన ముంబై పోలీసులు (Mumbai Police) కూడా భాగం అయ్యారు.
ముంబై పోలీసుల ఐకానిక్ బోట్ డ్యాన్స్ హిట్ కావడంతో, ఒరిజినల్ డ్యాన్స్ చూడని వాళ్లు ఇది చూసి ‘ఆహా’ ‘ఓహో’ అంటున్నారు.
ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ ఐకానిక్ బోట్ డ్యాన్స్ ట్రెండ్‌లో భాగం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌లో భాగం అవుతున్నవారు స్థానిక మ్యూజిక్‌ను వీడియోకు జత చేస్తున్నారు.
‘ఆరా ఫార్మింగ్’ అనేది ఇప్పుడు ఆన్‌లైన్‌లో పాపులర్ అయింది.
కదులుతున్న కారుపై..
జనమంతా చూస్తుండగా కదులుతున్న కారుపై ముంబై మహిళ ఒకరు చేసిన ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. నవీ ముంబైలోని ఖార్ఘర్‌లో కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్‌పై నజ్మీన్ సుల్దే అనే 24 ఏళ్ల మహిళ చెప్పులు లేకుండా డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
చదవండి: రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన.. ఏకంగా 170 గంటల పాటు..
నజ్మీన్‌తో పాటు కారు నడిపిన ఆమె ప్రియుడు అల్-ఫెష్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరితో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహన చట్టం కింద వారిని అరెస్ట్ కూడా చేశారు. అల్-ఫెష్ షేక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్తలు కూడా వచ్చాయి.
🔥🚨BREAKING: This young man named Dika has taken over the Internet on all platforms for ‘legendary aura farming’ he can be seen dancing on the front of boat races in Indonesia to boost moral.
The viral kid stealing hearts at Pacu Jalur, His dance isn't just moves, it's pure… pic.twitter.com/awify23gFh— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 7, 2025