
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka)ఎక్స్‌లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్ చేశారు. అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
హర్ష్‌గోయెంకా ట్వీట్: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను అమలు చేసే ఇంజీన్‌లా నా భారతీయ CEO ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన పేర్కొన్నారు.
ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన టెక్ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్‌లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో హర్ష్ గోయెంకా ట్వీట్ విశేషంగా నిలిచింది.
"సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.
చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
బెన్‌హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది? ఒక క్రికెట్ స్టార్‌ను బంతిని అలా ఫెచ్ చేయమని అడిగినంత కామెడీగా ఉంది. TCS వంటి భారతీయ సంస్థల వైపు ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్‌గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు అవకాశాన్ని వాడుకోండి.. లేదంటే మీకు నష్టం అని వ్యాఖ్యానించారు.
“ఇది బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని మరొకరు కమెంట్ చేశారు.
ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు