
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ (Anil Ambani) ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ప్రేమ కథ మరోసారి వార్తల్లో నిలిచింది. 1991లో అప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్‌ను (Tina Munim) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడించిందట. మొదట్లో అనిల్, టీనా ప్రేమకథను అంబానీ కుటుంబం (Ambani family) అంగీకరించ లేదట. అవును.. వివరాలు తెలుసుకుందాం.
కేవలం నటి అన్న కారణంగానే టీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేందుకు తమ చిన్న కొడుకు అనిల్ అంబానీ -టీనాను ప్రేమను తొలుత తల్లిదండ్రులు ధీరూభాయ్ , కోకిలాబెన్ అంబానీ వ్యతిరేకించారట. కానీ ఒపిగ్గా ఎదురు చూసి, తల్లిదండ్రులను ఒప్పించుకుని మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు అనిల్ అంబానీ -టీనా మునిమ్. అంతేకాదు అన్యోన్య దాంపత్యంతో తమ ప్రేమ అమరమని నిరూపించుకున్నారు.

అనిల్ టీనాను తొలుత ఎక్కడ చూశాడంటే
1983లో వార్టన్‌లో MBA పూర్తి చేసిన తర్వాత, అనిల్ మొదటిసారిగా టీనాను ఒక వివాహంలో తొలిసార చూశాడు. తొలి చూపులోనే ఆమెపై ప్రేమ చిగురించింది. సాంప్రదాయ హిందూ వివాహంలో బ్లాక్ సారీలో ప్రత్యేకంగా కనిపించిన టీనాను అనిల్‌ను దృష్టిని ఆకర్షించింది. కానీ అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక పరస్పర స్నేహితుడు వారిని ఫిలడెల్ఫియాలో పరిచయం చేశాడు.అపుడు టీనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1986లో మరోసారి టీనా మేనల్లుడు ద్వారా అనిల్ టీనా కలయిక వీరి జీవితాలను మలుపు తిప్పింది.
అనిల్ ప్రపోజల్ ప్లాన్, ముఖేష్ అంబానీ ఏం చేశారంటే
అనిల్ అంబానీ పెళ్లి ప్రపోజల్ ప్లాన్‌తో టీనా మునిమ్‌ను తన తల్లిదండ్రులు ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీలకు పరిచయం చేశాడు. ఈ సందర్బంలోనే ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ అనిల్ అలా బయటికి వెళ్లగానే అక్కడే వున్న సోదరుడు ముఖేష్ టీనాకు ఆ రహస్యాన్ని చెప్పడంతో ప్రపోజల్ ప్లాన్ చెడిపోయిందట. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)

అటు తమ చిన్న కుమారుడు ఒక నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసి అంబానీ కుటుంబం ఆ సంబంధాన్ని వ్యతిరేకించింది. దీంతో అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వేరే దారిలేక అనిల్ టీనా విడిపోవాల్సి వచ్చింది.
టీనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయింది. అనిల్‌తో సంబంధాలు దాదాపు కట్ అయిపోయాయి. ఇక్కడ అనిల్ మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా, అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే లాస్ ఏంజిల్స్‌లో భూకంపం రావడంతో అనిల్ పరిగెత్తుకుంటూ ప్రియురాలికి దగ్గరికి వెళ్లిపోయాడు.
చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్

మరోవైపు టీనాను వివాహం చేసుకునేందుకు అనిల్ కుటుంబం ఎట్టకేలకు ఒప్పుకుంది. కానీ టీనా అనిల్‌ను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో అనిల్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న టీనా రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయింది. అలా కుటుంబ ఆమోదంతో 1991, ఫిబ్రవరి 2న సాంప్రదాయ గుజరాతీ పద్ధతిలో వివాహం జరిగింది. ఇపుడు కోకిలాబెన్‌కు టీనా కూడా ఇష్టమైన కోడలు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు అనిల్-టీనా చూపించిన ఓర్పు, పట్టుదల వారి అమర ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అలా మూడు దశాబ్దాలకు పైగా అనిల్-టీనా వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, జై అన్మోల్ ,జై అన్షుల్ ఉన్నారు.