breaking news
Tina Munim
-
కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ (Anil Ambani) ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ప్రేమ కథ మరోసారి వార్తల్లో నిలిచింది. 1991లో అప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్‌ను (Tina Munim) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడించిందట. మొదట్లో అనిల్, టీనా ప్రేమకథను అంబానీ కుటుంబం (Ambani family) అంగీకరించ లేదట. అవును.. వివరాలు తెలుసుకుందాం.కేవలం నటి అన్న కారణంగానే టీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేందుకు తమ చిన్న కొడుకు అనిల్ అంబానీ -టీనాను ప్రేమను తొలుత తల్లిదండ్రులు ధీరూభాయ్ , కోకిలాబెన్ అంబానీ వ్యతిరేకించారట. కానీ ఒపిగ్గా ఎదురు చూసి, తల్లిదండ్రులను ఒప్పించుకుని మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు అనిల్ అంబానీ -టీనా మునిమ్. అంతేకాదు అన్యోన్య దాంపత్యంతో తమ ప్రేమ అమరమని నిరూపించుకున్నారు. అనిల్ టీనాను తొలుత ఎక్కడ చూశాడంటే1983లో వార్టన్లో MBA పూర్తి చేసిన తర్వాత, అనిల్ మొదటిసారిగా టీనాను ఒక వివాహంలో తొలిసార చూశాడు. తొలి చూపులోనే ఆమెపై ప్రేమ చిగురించింది. సాంప్రదాయ హిందూ వివాహంలో బ్లాక్ సారీలో ప్రత్యేకంగా కనిపించిన టీనాను అనిల్‌ను దృష్టిని ఆకర్షించింది. కానీ అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక పరస్పర స్నేహితుడు వారిని ఫిలడెల్ఫియాలో పరిచయం చేశాడు.అపుడు టీనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1986లో మరోసారి టీనా మేనల్లుడు ద్వారా అనిల్ టీనా కలయిక వీరి జీవితాలను మలుపు తిప్పింది. అనిల్ ప్రపోజల్ ప్లాన్, ముఖేష్ అంబానీ ఏం చేశారంటేఅనిల్ అంబానీ పెళ్లి ప్రపోజల్ ప్లాన్‌తో టీనా మునిమ్‌ను తన తల్లిదండ్రులు ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీలకు పరిచయం చేశాడు. ఈ సందర్బంలోనే ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ అనిల్ అలా బయటికి వెళ్లగానే అక్కడే వున్న సోదరుడు ముఖేష్ టీనాకు ఆ రహస్యాన్ని చెప్పడంతో ప్రపోజల్ ప్లాన్ చెడిపోయిందట. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)అటు తమ చిన్న కుమారుడు ఒక నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసి అంబానీ కుటుంబం ఆ సంబంధాన్ని వ్యతిరేకించింది. దీంతో అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వేరే దారిలేక అనిల్ టీనా విడిపోవాల్సి వచ్చింది.టీనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయింది. అనిల్‌తో సంబంధాలు దాదాపు కట్ అయిపోయాయి. ఇక్కడ అనిల్ మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా, అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే లాస్ ఏంజిల్స్‌లో భూకంపం రావడంతో అనిల్ పరిగెత్తుకుంటూ ప్రియురాలికి దగ్గరికి వెళ్లిపోయాడు.చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్ మరోవైపు టీనాను వివాహం చేసుకునేందుకు అనిల్ కుటుంబం ఎట్టకేలకు ఒప్పుకుంది. కానీ టీనా అనిల్‌ను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో అనిల్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న టీనా రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయింది. అలా కుటుంబ ఆమోదంతో 1991, ఫిబ్రవరి 2న సాంప్రదాయ గుజరాతీ పద్ధతిలో వివాహం జరిగింది. ఇపుడు కోకిలాబెన్‌కు టీనా కూడా ఇష్టమైన కోడలు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు అనిల్-టీనా చూపించిన ఓర్పు, పట్టుదల వారి అమర ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అలా మూడు దశాబ్దాలకు పైగా అనిల్-టీనా వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, జై అన్మోల్ ,జై అన్షుల్ ఉన్నారు. -
10 వేల కోట్ల ఆస్తులకు మహారాణి.. దివాలా దెబ్బ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
హీరోహీరోయిన్లకున్న డిమాండే వేరు! రెండు హిట్లు పడ్డాయంటే చాలు పారితోషికం అమాంతం పెంచేస్తారు. అదే వరుసగా ఫ్లాప్స్ వచ్చాయనుకో.. ఆ పారితోషికంలో హెచ్చుతగ్గులు లేకుండా అదే కంటిన్యూ చేస్తారు. సినిమా పీకల్లోతు నష్టాల్లో మునిగినప్పుడు మాత్రమే రెమ్యునరేషన్లో కొంత కట్ చేస్తారు.. అది కూడా ఎవరో ఒకరిద్దరు మాత్రమే! సినిమా బడ్జెట్లో పారితోషికానికే ఎక్కువగా ఖర్చవుతోంది. ఇప్పుడున్న అగ్రతారలంతా ఒక్కో సినిమాతో కోట్లు గడిస్తున్నారు. మూడు నిమిషాల పాటలో కనిపించినా కోటి వెనకేస్తున్నారు. అలాంటిది వారి ఆస్తులు ఎన్ని కోట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 20 ఏళ్ల వయసులో వెండితెరపై ఎంట్రీ అయితే 30 ఏళ్ల క్రితమే బాలీవుడ్‌కు దూరమైన ఓ నటి వేల కోట్ల సామ్రాజ్యానికి మమారాణిగా మారింది. సినిమాలతో ఎంత సంపాదించిందో కానీ బిలియనీర్‌ను పెళ్లి చేసుకుని అంతకంటే ధనవంతురాలిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబాని. ఆమె అసలు పేరు టీనా మునిమ్. 20 ఏళ్ల వయసులో దేశ్ పర్దేశ్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఆమెను చూడగానే ఇటు ప్రేక్షకలోకం, అటు సినీలోకం పరవశించిపోయింది. రాజేశ్ ఖన్నా, రిషి కపూర్, అమల్ పాలేకర్ వంటి బాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించింది. మొదట్లో వరుస విజయాలతో దూకుడు చూపించిన ఆమె 80వ దశాబ్దం మధ్య కాలం నుంచి అపజయాలను మూటగట్టుకుంది. టీనా కోసం హీరోల మధ్య గొడవ 1987 తర్వాత ఆమె రెండే రెండు సినిమాలు చేసింది. 1991లో వచ్చిన జిగర్వాలా చిత్రంలో చివరిసారిగా కనిపించింది. సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన రోజుల్లో టీనా పలువురు హీరోలతో లవ్వాయణం నడిపిందని వార్తలు వచ్చేవి. అందులో రిషి కపూర్ పేరు కూడా ఉంది. అయితే అది నిజం కాదని రిషి కపూర్ తన ఆత్మకథలో స్పష్టం చేశాడు. ఈ పుకారు నిజమేననుకున్న మరో హీరో సంజయ్ దత్ తనతో గొడవ పడేందుకు నేరుగా ఇంటికే వచ్చాడని కూడా వెల్లడించాడు. అంటే అప్పట్లో టీనా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం 1991 ఫిబ్రవరి 2న ఆమె అగ్ర వ్యాపారవేత్త అనిల్ అంబానీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె ఆస్తుల విలువ ఒకానొక దశలో రూ.10,000 కోట్లు. ఆమె భర్త అనిల్ అంబానీ (42 బిలియన్ డాలర్ల ఆస్తులతో) ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆరవ వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ రావడంతో వీరి సంపాదన కొంత ఆవిరైపోయింది. దీంతో ప్రస్తుతం టీనా ఆస్తి విలువ రూ.2331 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన బ్యూటీ -
ఆ హీరోయిన్ కోసం నన్ను కొట్టాలనుకున్నాడు
ముంబై: బాలీవుడ్లో ఎఫైర్స్, తగాదాలు, న్యాయపోరాటాలు కామన్‌గా మారిపోయాయి. సీనియర్ నటుడు రిషీ కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో ఇలాంటి విషయాన్నే వెల్లడించాడు. హీరో సంజయ్ దత్ ఓ హీరోయిన్ విషయంలో తనతో గొడవపడి కొట్టాలని భావించాడని రిషీ కపూర్ వెల్లడించాడు. తనను అపార్థం చేసుకోవడమే దీనికి కారణమని, తర్వాత సంజయ్ విషయం తెలుసుకుని తనతో సఖ్యతగా మెలిగాడని పేర్కొన్నాడు. నటుడు గుల్షన్ గ్రోవర్ చెప్పిన విషయాన్ని రిషీ కపూర్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. 'సంజయ్ దత్‌కు అప్పట్లో నటి టీనా మున్నిమ్తో ఎఫైర్ ఉండేది. టీనాతో రిషీ కపూర్‌కు కూడా ఎఫైర్ ఉందని సంజయ్ అనుమానించాడు. సంజయ్ స్నేహితులు రిషీ కపూర్ గురించి చెడుగా చెప్పడమే దీనికి కారణం. సంజు, నేను అన్నదమ్ముళ్లలాగా ఉండేవాళ్లం. ఓ రోజు సంజయ్ నా వద్దకు వచ్చి రిషీ కపూర్ ఇంటికి వెల్లి గొడవ పెట్టుకోవాలని చెప్పాడు. రిషీ కపూర్ భార్య నీతూజీ ఈ విషయంలో ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ జరగకుండా చూసింది. టీనాతో రిషీ కపూర్‌కు ఎఫైర్ లేదని సంజయ్‌కు వివరించింది చెప్పింది. దీంతో అక్కడ నుంచి మేం వచ్చేశాం' అని గుల్షన్ గ్రోవర్ చెప్పినట్టుగా రిషీ కపూర్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. -
ఆ హీరోయిన్‌తో నాకు ఎఫైర్ ఉందని..
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తన ఆత్మకథ ఖుల్లాం ఖుల్లాలో సంచలన, వివాదాస్పద విషయాలను వెల్లడించారు. హీరోయిన్లతో తనకు ఎఫైర్స్ ఉన్నట్టు పుకార్లు రావడం, వాటిపై భార్య నీతు స్పందన గురించి ఈ పుస్తకంలో రాశారు. తనకు వివాహం కాకముందు బాలీవుడ్ హీరోయిన్ టీనా మునిమ్‌తో ఎఫైర్ ఉన్నట్టు మరో హీరో సంజయ్ దత్ అనుమానించాడని రిషి కపూర్ పేర్కొన్నారు. అప్పట్లో టీనా సంజయ్ పట్ల ఆకర్షితురాలైందని వెల్లడించారు. మీడియా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని, కానీ కొందరు బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తనకు టీనాతో సీక్రెట్ ఎఫైర్ ఉందని భావించేవారని తెలిపారు. ఈ విషయం తెలియగానే ఓ రోజు సంజయ్ దత్, గుల్షన్ గ్రోవర్తో కలసి తనతో గొడవ పడటానికి నీతూ ఇంటికి వచ్చారని వివరించారు. ఇద్దరి మధ్య గొడవ కాకుండా నీతూ పరిష్కారం చేసిందని వెల్లడించారు. తనకు, టీనాకు మధ్య ఎపైర్ లేదని, ఈ పుకార్లు నిరాధారమని, కేవలం కో స్టార్లుగా స్నేహంగా ఉంటారని.. సంజయ్‌కు నీతూ చెప్పి నమ్మించడంతో వివాదం ముగిసిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రస్తావన వచ్చినపుడు తాను, సంజయ్ నవ్వుకునేవాళ్లమని తెలిపారు. ఈ సంఘటన జరిగాక నీతూ, తాను వివాహం చేసుకున్నామని, తమ పెళ్లికి తన హీరోయిన్లు అందరూ వచ్చారని వెల్లడించారు. పెళ్లయిన తర్వాత డింపుల్ కపాడియాతో తనకు ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయని రిషి కపూర్ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకముందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్ తనకు స్నేహితురాలు మాత్రమేనని పేర్కొన్నారు. తామిద్దరం బాబీ సినిమాలో నటించామని, తర్వాత సాగర్ సినిమా చేశామని తెలిపారు.