టాప్‌ ట్రెండింగ్‌లో టాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే? | Tollywood Latest Crime Thriller Blind Spot Trending In Top In OTT | Sakshi
Sakshi News home page

Blind Spot Ott: టాప్‌-2లో బ్లైండ్ స్పాట్‌.. ఏ ఓటీటీలో చూడాలంటే

Jun 20 2025 4:40 PM | Updated on Jun 20 2025 5:38 PM

Tollywood Latest Crime Thriller Blind Spot Trending In Top In OTT

టాలీవుడ్ నటుడు నవీన్‌ చంద్ర మరో ఆసక్తికర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్లైండ్ స్పాట్ అనే క్రైమ్ థ్రిల్లర్‌ మూవీతో అలరించాడు.  మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు.

అయితే ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్‌ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్‌-2లో ట్రెండ్‌ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ క్రైమ్ థ్రిల్లర్ కథేంటో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో రాశీసింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో  ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.

బ్లైండ్ స్పాట్ కథేంటంటే?

హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది.  ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్‌ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్‌ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి  ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement