ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మూవీ.. టాప్ టెన్‌లో ట్రెండింగ్‌! | Tollywood movie Chaurya Paatham trending In Ott | Sakshi
Sakshi News home page

Chaurya Paatham In Ott: ఓటీటీలో దూసుకెళ్తోన్న చౌర్యపాఠం.. టాప్‌లో ట్రెండింగ్‌!

May 31 2025 9:17 PM | Updated on May 31 2025 9:17 PM

Tollywood movie Chaurya Paatham trending In Ott

ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.  ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఆడియన్స్‌ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన 'చౌర్య పాఠం (Chaurya paatam) ఓటీటీలో దూసుకెళ్తోంది. ఏకంగా టాప్‌ టెన్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ మూవీ అమెజాన్‌లో టాప్‌-7లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీమ్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

ఈ సినిమా కథేంటంటే..

చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. ‍బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement